Srihari | రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెళ్లిపీటలెక్కనున్న పెద్ద కుమారుడు శశాంక్
Srihari | తెలుగు సినీ పరిశ్రమలో తనదైన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు దివంగత రియల్ స్టార్ శ్రీహరి. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా తన గంభీరమైన గొంతు, సహజమైన నటన, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో టాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
Srihari | తెలుగు సినీ పరిశ్రమలో తనదైన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు దివంగత రియల్ స్టార్ శ్రీహరి. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా తన గంభీరమైన గొంతు, సహజమైన నటన, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో టాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే శ్రీహరి అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు కూడా తీరని లోటుగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆయన సినిమాలను గుర్తుచేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కాగా, తాజాగా శ్రీహరి కుటుంబానికి సంబంధించి ఓ శుభవార్త బయటకు వచ్చింది. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
దివంగత నటుడు శ్రీహరి, ఆయన భార్య శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి కాగా, చిన్న కుమారుడు మేఘాంశ్ శ్రీహరి. వీరిలో శశాంక్ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శ్రీహరి కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే స్నేహితుల కుటుంబం నుంచే శశాంక్‌కు జీవిత భాగస్వామిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాబోయే వధువు పేరు సంజన అని సమాచారం.ఇరు కుటుంబాల మధ్య చాలాకాలంగా మంచి సాన్నిహిత్యం ఉండటంతో పెద్దలు ఈ వివాహ సంబంధాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో శశాంక్, సంజనల పెళ్లి విషయంపై ముందడుగు పడిందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇరు కుటుంబాల సభ్యులు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
శశాంక్ శ్రీహరి, సంజనల నిశ్చితార్థానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న వీరి ఎంగేజ్మెంట్ వేడుక నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకను కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరపాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టాలీవుడ్‌కు చెందిన కొందరు సినీ ప్రముఖులు, శ్రీహరి కుటుంబానికి అత్యంత ఆప్తులైన స్నేహితులు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. నిశ్చితార్థ వేడుక అనంతరం వివాహ తేదీకి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై శ్రీహరి కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- disco Shanti
- Marriage
- Shashank
- Son
RELATED ARTICLES
తాజా వార్తలు
Srihari | రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెళ్లిపీటలెక్కనున్న పెద్ద కుమారుడు శశాంక్
Narayanpet | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం.. విద్యార్థినుల వస్తువులు దగ్ధం
Jagtial | మల్లాపూర్‌లో విషాదం.. నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి
Sai Pallavi | ధనుష్ సినిమాలు వదిలేయోద్దు.. స్టేజ్‌పైనే ఎమోషనల్ రిక్వెస్ట్ చేసిన సాయి పల్లవి
Cyclone Akvan | మరింత బలపడ్డ తీవ్ర వాయుగుండం.. ఇవాళ సాయంత్రం తుపానుగా మారే అవకాశం!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

