Sai Pallavi | ధనుష్ సినిమాలు వదిలేయోద్దు.. స్టేజ్‌పైనే ఎమోషనల్ రిక్వెస్ట్ చేసిన సాయి పల్లవి
Sai Pallavi | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? దళపతి విజయ్ బాటలోనే పయనిస్తూ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా? ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Sai Pallavi | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? దళపతి విజయ్ బాటలోనే పయనిస్తూ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా? ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ నటించిన ‘ఓం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ధనుష్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సాయి పల్లవి వేదికపై ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి వస్తున్న సమయంలో రహదారుల వెంట కనిపించిన జెండాలను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. అక్కడి వాతావరణం చూస్తుంటే సినిమా వేడుకకు వచ్చినట్లు కాకుండా, ఓ భారీ రాజకీయ సభకు వచ్చినట్లు అనిపించిందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో ఆడిటోరియం మొత్తం అభిమానుల కేరింతలు, ఈలలతో మార్మోగిపోయింది.
ఆ తర్వాత ధనుష్‌ను ఉద్దేశించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘‘సర్.. మీరు జీవితంలో ఏం చేసినా, ఏ రంగంలోకి వెళ్లినా మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. కానీ నాలోని నటిగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే విజయ్ సర్ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమయ్యారు. అది సినీ పరిశ్రమకు తీరని లోటు. కనీసం మీరు మాత్రం సినిమాల్లో కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. మంచి కథలకు ప్రాణం పోసే ధనుష్ లాంటి ప్రతిభావంతమైన నటులు సినీ పరిశ్రమకు ఎంతో అవసరమని సాయి పల్లవి అభిప్రాయపడ్డారు. ఆయన కూడా సినిమాలకు దూరమైతే ప్రేక్షకులు ఓ అద్భుతమైన నటుడిని కోల్పోవాల్సి వస్తుందని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ విజ్ఞప్తికి అక్కడున్న అభిమానులు పెద్ద ఎత్తున చప్పట్లతో మద్దతు తెలిపారు.
ప్రస్తుతం సాయి పల్లవి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధనుష్ అభిమానులు సైతం ఆమె వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ, తమ అభిమాన హీరో సినిమాల్లోనే కొనసాగాలని కోరుకుంటున్నారు. అయితే ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. మరి భవిష్యత్తులో ధనుష్ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తారా? లేక రాజకీయాల వైపు అడుగులు వేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | ధనుష్ సినిమాలు వదిలేయోద్దు.. స్టేజ్‌పైనే ఎమోషనల్ రిక్వెస్ట్ చేసిన సాయి పల్లవి
Cyclone Akvan | మరింత బలపడ్డ తీవ్ర వాయుగుండం.. ఇవాళ సాయంత్రం తుపానుగా మారే అవకాశం!
NTR | అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ చిత్రం.. టైటిల్ ఏంటో తెలుసా?
Varanasi | వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్.. షూటింగ్ పూర్తి, త్వరలోనే రాజమౌళి భారీ సర్ప్రైజ్!
Motivational Story | పొలంలో ముల్లు గుచ్చుకుంటే ఆగలేదు.. అడవిలో పాములను చూసి ఎందుకు భయపడ్డాడు?.
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

