Cyclone Akvan | మరింత బలపడ్డ తీవ్ర వాయుగుండం.. ఇవాళ సాయంత్రం తుపానుగా మారే అవకాశం!
Cyclone Akvan | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మరింత బలపడింది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర వాయవ్య దిశగా కదలుతోంది.
Cyclone Akvan | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మరింత బలపడింది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర వాయవ్య దిశగా కదలుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. నవంబర్ 16వ తేదీ ఉదయం 5.30 గంటలకు ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో 11.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఇది కేంద్రీకృతమై ఉంది.
విశాఖకు 820 కిలోమీటర్ల దూరంలో..
ప్రస్తుతం తీవ్ర వాయుగుండం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 720 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 940 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీలంకలోని ట్రింకోమలీకి ఈశాన్యంగా 630 కిలోమీటర్లు, అండమాన్ నికోబార్ దీవుల్లోని శ్రీ విజయపురానికి పశ్చిమాన 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
నేడు తుపానుగా.. రేపు తీవ్ర తుపానుగా!
తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 16వ తేదీ సాయంత్రానికి దక్షిణ, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అనంతరం నవంబర్ 17వ తేదీ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారవచ్చని పేర్కొంది. ఆ తర్వాత మరింత బలపడి వాయవ్య దిశగా పయనిస్తూ నవంబర్ 19వ తేదీ రాత్రికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి అతి తీవ్ర తుపానుగా చేరే అవకాశం ఉందని వెల్లడించింది.
ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు ఎల్లో అలర్ట్
తీవ్ర వాయుగుండం కదలికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు ఐఎండీ ప్రీ సైక్లోన్ వాచ్ కింద ఎల్లో సందేశాన్ని జారీ చేసింది. తుపాను ఏర్పడే అవకాశం, దాని తదుపరి గమనం దృష్ట్యా వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Akvan | మరింత బలపడ్డ తీవ్ర వాయుగుండం.. ఇవాళ సాయంత్రం తుపానుగా మారే అవకాశం!
NTR | అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ చిత్రం.. టైటిల్ ఏంటో తెలుసా?
Varanasi | వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్.. షూటింగ్ పూర్తి, త్వరలోనే రాజమౌళి భారీ సర్ప్రైజ్!
Motivational Story | పొలంలో ముల్లు గుచ్చుకుంటే ఆగలేదు.. అడవిలో పాములను చూసి ఎందుకు భయపడ్డాడు?.
Ant Story | ఓ చిన్న చీమ చెప్పిన గొప్ప జీవిత పాఠం.. ఖురాన్లో ప్రస్తావించిన అద్భుత కథ
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

