Narayanpet | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం.. విద్యార్థినుల వస్తువులు దగ్ధం
Narayanpet | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం (నవంబర్ 16) తెల్లవారుజామున సుమారు 5.30 గంటలకు భవనం మూడో అంతస్తులోని ఓ గదిలో మంటలు చెలరేగాయి
Narayanpet | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం (నవంబర్ 16) తెల్లవారుజామున సుమారు 5.30 గంటలకు భవనం మూడో అంతస్తులోని ఓ గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మూడో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న 20 మందికి పైగా విద్యార్థినులకు చెందిన వ్యక్తిగత వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదని సమాచారం.
నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాల యాజమాన్యం విద్యార్థినుల వసతి కోసం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకుంది. అందులో మూడో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థినులు ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఓ గదిలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు మంటలు కొనసాగినట్లు విద్యార్థినులు తెలిపారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అద్దె భవనంలో అగ్నిమాపక యంత్రాలు (ఫైర్ ఎక్స్టింగ్విషర్లు), ఇతర ప్రాథమిక అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవని విద్యార్థినులు ఆరోపించారు. భవనంలో సరైన గాలి ప్రసరణ లేకపోవడంతో కొందరు విద్యార్థినులు పొగ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ లేదా వాటర్ హీటర్‌లో ఏర్పడిన లోపం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో విద్యార్థినుల దుస్తులు, పుస్తకాలు, ఇతర వ్యక్తిగత వస్తువులు కాలిపోయాయి. కాగా, కళాశాలలో శాశ్వత హాస్టల్ భవన నిర్మాణానికి 2024లోనే శంకుస్థాపన చేసినప్పటికీ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని విద్యార్థినులు చెబుతున్నారు. నర్సింగ్ కళాశాల భవనం పూర్తయినప్పటికీ తమకు ఆ తరహా హాస్టల్ వసతులు ఎప్పుడు కల్పిస్తారో తెలియడం లేదని ఓ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.
హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ)కు చెందిన కార్తీక్ నాగుల ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ ఇలాంటి అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, ఇది రెండో ఘటన అని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై దృష్టి సారిస్తున్నప్పటికీ.. మౌలిక సదుపాయాలు, హాస్టల్ వసతి, విద్యార్థుల భద్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లపై తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. శాశ్వత హాస్టల్ భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి, పూర్తిస్థాయి భద్రతా సదుపాయాలతో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రాథమిక అగ్నిమాపక పరికరాలు కూడా లేని భవనాల్లో విద్యార్థులను ఉంచడం ఆందోళనకరమని కార్తీక్ నాగుల పేర్కొన్నారు.
నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం..
షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకుని హాస్టల్‌గా నిర్వహిస్తున్న కాలేజీ యాజమాన్యం
అగ్నిప్రమాదంలో విద్యార్థినుల వస్తువులు పూర్తిగా దగ్ధం
దట్టమైన పొగతో కొందరు విద్యార్థినులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
హాస్టల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కూడా అందుబాటులో లేవంటున్న స్టూడెంట్స్
అదృష్టవశాత్తూ విద్యార్థినులందరూ క్షేమం
హాస్టల్లో భద్రతా ప్రమాణాలు, కనీస సౌకర్యాలపై ఆందోళన
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 16, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం.. విద్యార్థినుల వస్తువులు దగ్ధం
Jagtial | మల్లాపూర్‌లో విషాదం.. నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి
Sai Pallavi | ధనుష్ సినిమాలు వదిలేయోద్దు.. స్టేజ్‌పైనే ఎమోషనల్ రిక్వెస్ట్ చేసిన సాయి పల్లవి
Cyclone Akvan | మరింత బలపడ్డ తీవ్ర వాయుగుండం.. ఇవాళ సాయంత్రం తుపానుగా మారే అవకాశం!
NTR | అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ చిత్రం.. టైటిల్ ఏంటో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

