Jagtial | మల్లాపూర్‌లో విషాదం.. నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి
Jagtial | జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వడ్డెర కాలనీలో పశువులకు నీళ్లు తాగించేందుకు ఏర్పాటు చేసిన తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు.
Jagtial | జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వడ్డెర కాలనీలో పశువులకు నీళ్లు తాగించేందుకు ఏర్పాటు చేసిన తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వడ్డెర కాలనీకి చెందిన సూర లావణ్య, అంజయ్య దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. లావణ్య రోజువారీ కూలీ పనుల నిమిత్తం ఉదయం వాల్గొండ గ్రామానికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు మాత్రమే కనిపించారు. ఆరేళ్ల చిన్నారి సూర బన్నీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
వెంటనే బాలుడి కోసం పరిసర ప్రాంతాల్లో వెతకగా.. పశువులకు నీళ్లు తాగించేందుకు ఏర్పాటు చేసిన తొట్టిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అప్పటివరకు తమతో ఆడుకుంటూ తిరిగిన చిన్నారి విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో వడ్డెర కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | మల్లాపూర్‌లో విషాదం.. నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి
Sai Pallavi | ధనుష్ సినిమాలు వదిలేయోద్దు.. స్టేజ్‌పైనే ఎమోషనల్ రిక్వెస్ట్ చేసిన సాయి పల్లవి
Cyclone Akvan | మరింత బలపడ్డ తీవ్ర వాయుగుండం.. ఇవాళ సాయంత్రం తుపానుగా మారే అవకాశం!
NTR | అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ చిత్రం.. టైటిల్ ఏంటో తెలుసా?
Varanasi | వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్.. షూటింగ్ పూర్తి, త్వరలోనే రాజమౌళి భారీ సర్ప్రైజ్!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

