Thorrur | డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రశ్నిస్తే అరెస్టులా?.. బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకున్న పోలీసులు
Thorrur | మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇళ్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాటపట్టారు.
Thorrur | తొర్రూరు, నవంబర్ 16 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇళ్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన బాటపట్టారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే ఎక్కడికక్కడ నాయకులను అదుపులోకి తీసుకోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.
పేదలకు న్యాయం చేయాలని ప్రశ్నిస్తే అరెస్టులతో సమాధానం చెబుతారా? అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 280 ఇళ్ల పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించి, ఇళ్ల కేటాయింపుల్లో వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమైతే, అక్రమ వసూళ్ల ఆరోపణలపై విచారణ జరిపించడానికి వెనుకాడాల్సిన అవసరం ఏమిటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శిస్తున్నారు.

Thorrur Brs3
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు!
ఎన్ని అరెస్టులు చేసినా పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో అర్హులైన ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఇళ్ల కేటాయింపుల్లో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తారా? లేక ప్రశ్నించే వారిని అరెస్టులతో అడ్డుకుంటారా? అన్నది ఇప్పుడు తొర్రూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Thorrur Brs1
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thorrur | డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రశ్నిస్తే అరెస్టులా?.. బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకున్న పోలీసులు
Srihari | రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెళ్లిపీటలెక్కనున్న పెద్ద కుమారుడు శశాంక్
Narayanpet | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం.. విద్యార్థినుల వస్తువులు దగ్ధం
Jagtial | మల్లాపూర్‌లో విషాదం.. నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి
Sai Pallavi | ధనుష్ సినిమాలు వదిలేయోద్దు.. స్టేజ్‌పైనే ఎమోషనల్ రిక్వెస్ట్ చేసిన సాయి పల్లవి
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

