Errabelli Dayakar Rao | పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులా?.. తొర్రూర్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై ఎర్రబెల్లి ఫైర్
Errabelli Dayakar Rao | మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు.
Errabelli Dayakar Rao | మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. పాలన గాలికి వదిలేసి బీఆర్ఎస్ నాయకులపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సిగ్గుచేటు అని విమర్శించారు.
తొర్రూర్ పట్టణంలో కేసీఆర్ హయాంలో నిర్మించిన 280 డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు కేటాయించడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. కమిషన్లు ఇచ్చినవారికి ఇండ్లు కేటాయిస్తూ, అర్హులైన లబ్ధిదారులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నదని విమర్శించారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జాబితాను కౌన్సిలర్లకు అందజేయకుండా, తెల్లవారుజాము 3 గంటల నుంచే బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడమేంటని ప్రశ్నించారు. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం అంటూ నిలదీశారు.
ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడబోదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి తొర్రూర్ పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Errabelli Dayakar Rao | పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులా?.. తొర్రూర్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై ఎర్రబెల్లి ఫైర్
Thorrur | డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రశ్నిస్తే అరెస్టులా?.. బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకున్న పోలీసులు
Srihari | రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెళ్లిపీటలెక్కనున్న పెద్ద కుమారుడు శశాంక్
Narayanpet | నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం.. విద్యార్థినుల వస్తువులు దగ్ధం
Jagtial | మల్లాపూర్లో విషాదం.. నీటి తొట్టిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

