క్రెమ్లిన్: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా ఆదివారం రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారని, మాస్కో సమీపంలోని రష్యన్ ఈ కామర్స్ కంపెనీ ‘వైల్డ్ బెర్రీస్’కు చెందిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారం. ఈ దాడి దరిమిలా ఆకాశంలో నల్లటి పొగలు ఎగసిపడ్డాయి. గత 24 గంటల్లో తొమ్మిది ఉక్రెనియన్ క్రూయిజ్ క్షిపణులను, మొత్తం 1,478 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.
మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ మాట్లాడుతూ రాజధానిపై దాదాపు 600 డ్రోన్లను ప్రయోగించారని, గత రెండేండ్లలో మాస్కోపై జరిగిన అతిపెద్ద వైమానిక దాడి ఇదేనని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఉక్రెయిన్ తన సుదూర డ్రోన్, క్షిపణి సామర్థ్యాలను మరింతగా విస్తరించింది. దీంతో ఇప్పుడు రష్యా భూభాగంలోని 1,500 మైళ్ల దూరం వరకూ గల లక్ష్యాలను ఛేదించగలదు.