పాట్నా: ఒక వేడుకలో ఏర్పాటు చేసిన డీజే మ్యూజిక్ సిస్టమ్ మొరాయించింది. అయితే చేతబడి వల్ల ఆ మ్యూజిక్ సిస్టమ్ పనిచేయలేదని కొందరు అనుమానించారు. (Black Magic) ఈ నేపథ్యంలో చేతబడి చేసే భార్యాభర్తలను దారుణంగా కొట్టారు. ఆ వ్యక్తి మరణించగా అతడి భార్య తీవ్రంగా గాయపడింది. బీహార్లోని నవాడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 26న ఒక గ్రామంలో ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా డీజే ఏర్పాటు చేశారు.
కాగా, ఉన్నట్టుండి మ్యూజిక్ సిస్టమ్ ఆగిపోయింది. అది ఎంతకీ పనిచేయలేదు. అయితే చేతబడి కారణం వల్ల ఆ మ్యూజిక్ సిస్టమ్లో లోపం తలెత్తిందని ఆ కుటుంబం అనుమానించింది. ఆ గ్రామంలో చేతబడి చేస్తారని అనుమానించే భార్యాభర్తలను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. దెబ్బలు తాళలేక 55 ఏళ్ల గయా మాంఝీ మరణించాడు. అతడి భార్య సముద్రి మాంఝీ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మోహన్ మాంఝీ, 9 మంది మహిళలతో సహా 17 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read:
Minister Chased By Locals | మంత్రిపై దాడికి జనం యత్నం.. కిలోమీటరు దూరం వరకు వెంబడించిన వైనం
Woman Gives Birth To 17th Child | 55 ఏళ్ల వయస్సులో.. 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Watch: క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లి, నోట్లు వెదజల్లిన కోతి.. తర్వాత ఏం జరిగిందంటే?