వర్టికల్ డీటైయిలింగ్ ఉండే దుస్తుల్ని ఎంచుకుంటే.. ఎత్తు తక్కువ ఉన్నవాళ్లు కూడా పొడవుగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివారు బటన్ షర్ట్స్, నిలువు గీతలు, చారలు ఉండే డ్రెస్సులు ధరించాలని సూచిస్తున్నారు.
ఇవి వ్యక్తులను పొడుగ్గా కనిపించేలా చేస్తాయట. ఇక ప్యాంట్లు, బాటమ్స్ను పాదాలు, చీలమండలకు పైన ఉండేలా ధరించాలట. వీటివల్ల షూపైన క్లీన్లైన్ వస్తుంది. దీంతో వారు పొడుగ్గా కనిపిస్తారు. పొడువు ఎక్కువగా ఉన్న ప్యాంట్లు వేసుకుంటే.. పొట్టిగా కనిపించేలా చేస్తాయట.