జైపూర్: ఒక మహిళ 55 ఏళ్ల వయస్సులో 17వ బిడ్డకు జన్మనిచ్చింది. (Woman Gives Birth To 17th Child) స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ బిడ్డను ప్రసవించింది. ఆమెకు 17వ కాన్పు అని తెలుసుకుని డాక్టర్లు షాకయ్యారు. అయితే 17 మంది సంతానంలో పుట్టిన వెంటనే ఐదుగురు పిల్లలు మరణించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లీలావాస్ గ్రామానికి చెందిన కవారా రామ్ భార్య అయిన 55 ఏళ్ల రేఖ బుధవారం జాడోల్ బ్లాక్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 17వ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
కాగా, కవారా, రేఖ దంపతులు ఇప్పటి వరకు 17 మంది పిల్లలను కన్నారు. అయితే నలుగురు మగ, ఒక ఆడ బిడ్డ పుట్టిన వెంటనే మరణించారు. ప్రస్తుతం ఈ దంపతులకు 12 మంది పిల్లలు ఉన్నారు. ఏడుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. 11 మందికి పెళ్లిళ్లు కావడంతోపాటు ఒక్కొక్కరికి ఇద్దరు నుంచి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీంతో 17వ బిడ్డకు రేఖ జన్మనివ్వకముందే ఆమెకు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.
మరోవైపు కవారా, రేఖ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. కవారా స్క్రాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. తన పిల్లల వివాహాల కోసం వడ్డీకి అప్పు చేసినట్లు అతడు తెలిపాడు. తన పిల్లల్లో ఎవరూ కూడా స్కూల్‌కు వెళ్లి చదువుకోలేదని చెప్పాడు.
కాగా, రేఖ తొలుత నాల్గవ కాన్పు అని చెప్పిందని ప్రసవాన్ని పర్యవేక్షించిన డాక్టర్ రోషన్ దరంగి తెలిపారు. అయితే ఆమె ఇప్పటికే 16 మంది పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలుసుకుని షాక్ అయినట్లు చెప్పారు. చాలా ప్రసవాల కారణంగా రేఖ గర్భాశయం బలహీనపడిందని అన్నారు. అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ కాన్పు బాగానే జరిగిందని వివరించారు.
Also Read:
Minister Chased By Locals | మంత్రిపై దాడికి జనం యత్నం.. కిలోమీటరు దూరం వరకు వెంబడించిన వైనం
Boy Hits Man With Car, Drags Body | కారుతో వ్యక్తిని ఢీకొట్టి.. కొంతదూరం ఈడ్చుకెళ్లిన బాలుడు
Watch: క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లి, నోట్లు వెదజల్లిన కోతి.. తర్వాత ఏం జరిగిందంటే?