Holi celebrations | రాయపోల్, మార్చి 03 : కాముని పున్నమి పురస్కరించుకొని సోమవారం రాత్రి సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఆయా గ్రామాల కూడళ్ల వద్ద కామ దహనం నిర్వహించారు. అనంతరం మంగళవారం ఉదయం నుంచే హోలీ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు, యువతీ యువకులు, పెద్దలు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ హోలీ సంబురాల్లో మునిగి తేలారు. రాయపోల్ మండలంలోని వీరారెడ్డి పల్లి గ్రామంలో కేరింతల మద్య గ్రామ యువకులు హోలీ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. వీరారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ రొయ్యల సుగుణ శ్రీనివాస్, నాయకుడు డీలర్ శ్రీనివాస్, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో చిన్నారులు, యువకులు, ప్రజలు ఘనంగా రంగుల పండుగ హోలీని జరుపుకున్నారు.
Sanju Samson | అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో .. సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Asif Zardari | మరో యుద్ధానికి భారత్ సన్నాహాలు.. పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆరోపణలు