న్యూఢిల్లీ: మైనర్ బాలుడు కారు నడిపాడు. ఒక వ్యక్తిని ఢీకొట్టాడు. కారు ఆపని ఆ బాలుడు కింద పడిన వ్యక్తిని కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. (Boy Hits Man With Car, Drags Body) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల సుజీత్ మండల్, బద్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని పీవీసీ పైపుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో పని తర్వాత నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నాడు.
కాగా, నార్త్ ఢిల్లీ పవర్ లిమిటెడ్ (ఎన్డీపీఎల్) కార్యాలయం సమీపంలో ఎర్ర రంగు కారు దూసుకువచ్చింది. నడిచి వెళ్తున్న సుజీత్‌ను అది ఢీకొట్టింది. దీంతో అతడు కారు కింద పడ్డాడు. అయితే డ్రైవర్ కారును ఆపలేదు. కారు కింద పడిన సుజీత్‌ను సుమారు 600 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కారులో పారిపోయాడు. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన సుజీత్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంబర్ ప్లేట్ ఆధారంగా కారు యజమానిని గుర్తించారు.
అయితే ప్రమాద సమయంలో విద్యార్థి అయిన 16 ఏళ్ల బాలుడు కారు నడిపినట్లు పోలీసులు ధృవీకరించారు. నిందితుడైన బాల నేరస్తుడ్ని అదుపులోకి తీసుకున్నారు. జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
दिल्ली के समयपुर बदली में एक 16 साल के नाबालिग ने अपनी कार से 32 साल के आदमी को रौंद दिया। फिर 600 मीटर तक घसीटा। शख्स की मौत हो गई।
सावल: नाबालिगों को गाड़ियां क्यों सौंपी जा रही हैं? यही है दिल्ली की कानून व्यवस्था? pic.twitter.com/4pgJZYJY4f— Mansi Joshi (@mansiupdates) August 27, 2025
Also Read:
cop sets wife ablaze | వరకట్న వివాదం వల్ల.. భార్యకు నిప్పంటించిన పోలీస్
Woman Gang Raped | మహిళను కిడ్నాప్ చేసి.. ఆరు నెలలుగా సామూహిక అత్యాచారం