భువనేశ్వర్: కొందరు వ్యక్తులు ఒక మహిళను కిడ్నాప్ చేశారు. ఒక ఇంట్లో నిర్బంధించి ఆరు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Woman Gang Raped) అక్కడి నుంచి తప్పించుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెదిన 23 ఏళ్ల మహిళను స్థానిక వ్యక్తి మార్చిలో కిడ్నాప్ చేశాడు. మయూర్భంజ్ జిల్లా బారిపడలోని ఒక ఇంట్లో ఆమెను ఉంచాడు. గత ఆరు నెలలుగా కొందరు వ్యక్తులు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, ఆ మహిళ అక్కడి నుంచి తప్పించుకున్నది. ఆగస్ట్ 26న జరిగిన దారుణం గురించి భోగ్రై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళను బాలసోర్లోని పునరావాస కేంద్రానికి తరలించారు. బుధవారం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు తన కుమార్తె ఒక వ్యక్తితో పారిపోయిందని ఆ మహిళ తల్లి ఆరోపించింది. రూ.3 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను వెంట తీసుకెళ్లినట్లు మార్చి 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: పసి బిడ్డకు టీకా వేసేందుకు.. ఉప్పొంగుతున్న వాగును దాటిన ఆరోగ్య కార్యకర్త
MBBS Admission Scam Busted | బయటపడిన ఎంబీబీఎస్ అడ్మిషన్ల స్కామ్.. నకిలీ ఎన్నారై పత్రాలతో ప్రవేశాలు