Watch: పసి బిడ్డకు టీకా వేసేందుకు.. ఉప్పొంగుతున్న వాగును దాటిన ఆరోగ్య కార్యకర్త
Health Worker Crosses Flooded Stream | పసి బిడ్డకు టీకా వేసేందుకు ఆరోగ్య కార్యకర్త పెద్ద సాహసం చేసింది. రాళ్లపైకి దూకి ఉప్పొంగుతున్న వాగును దాటింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సిమ్లా: పసి బిడ్డకు టీకా వేసేందుకు ఆరోగ్య కార్యకర్త పెద్ద సాహసం చేసింది. రాళ్లపైకి దూకి ఉప్పొంగుతున్న వాగును దాటింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Health Worker Crosses Flooded Stream) హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మండి జిల్లాలోని రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల ఆడ శిశువుకు టీకా వేసేందుకు ఆరోగ్య కార్యకర్త అయిన 40 ఏళ్ల కమలా దేవి పెద్ద సాహసం చేసింది. చౌహర్ఘాటిలో ఉప్పొంగుతున్న వాగును ధైర్యంగా దాటింది. బండరాళ్లపైకి దూకి వాగు అవతల వైపునకు వెళ్లింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నప్పటికీ శిశువుకు టీకా వేసేందుకు ఈ సాహసం చేసింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ప్రమాదం ఉన్నప్పటికీ కమలా దేవి తన విధి పట్ల చూపిన అంకితభావాన్ని పలువురు ప్రశంసించారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధుల నిర్వహణకు ఎవరినీ బలవంతం చేయకూడదని కొందరు సూచించారు. ఆమె చర్యను మరికొందరు తప్పుపట్టారు.
Such people truly need appreciation! 🙌 From Chauharghati Mandi HP, Kamla Devi, a health worker, crossed a flooded stream by jumping to reach Hurang village and vaccinate babies. With roads blocked due to floods and landslides, she carried duty on her shoulders. pic.twitter.com/FbysmHKqOB
— Nikhil saini (@iNikhilsaini) August 22, 2025
Also Read:
Tejashwi Yadav | చిరాగ్ పెళ్లి చేసుకోవాలని తేజస్వి యాదవ్ సలహా.. తనకూ వర్తిస్తుందన్న రాహుల్
Watch: రైలు ఎక్కబోతూ పట్టాల వద్ద పడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

