భువనేశ్వర్: ఒక వ్యక్తి ‘స్పైడర్ మ్యాన్’ తరహా దుస్తులు ధరించాడు. రోడ్డుపై వేగంగా వెళ్లడంతో పాటు బైక్‌పై స్టంట్లు చేశాడు. (Spiderman Goes On Bike Stunt) ట్రాఫిక్ పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. ఆ బైక్‌ను స్వాధీనం చేసుకోవడంతోపాటు భారీగా జరిమానా విధించారు. ఒడిశాలోని రూర్కెలాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 20న ఒక వ్యక్తి ‘స్పైడర్ మ్యాన్’ డ్రెస్ ధరించాడు. పెద్ద శబ్దంతో బైక్‌ను వేగంగా నడిపాడు. అలాగే రోడ్డుపై ప్రమాదకరంగా విన్యాసాలు చేశాడు.
కాగా, ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. అతడి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెల్మెట్ ధరించకుండా మోటార్ సైకిల్ నడపడం, వేగ పరిమితిని ఉల్లంఘించడం, మోడిఫైడ్ సైలెన్సర్‌ను ఉపయోగించడం వంటి అభియోగాలపై భారీగా జరిమానా విధించారు. ఆ వ్యక్తికి రూ.15,000 మేర చలాన్ జారీ చేశారు.
Also Read:
Pak Nationals In Voter List | బీహార్ ఓటర్ల జాబితాలో పాకిస్థానీ జాతీయులు.. దర్యాప్తునకు ఆదేశం
Man Reports Wife Missing | భార్య మిస్సింగ్‌పై భర్త ఫిర్యాదు.. హత్య చేసినట్లు పట్టించిన కలరా ఉండలు