ఢిల్లీ: భారత్, శ్రీలంకలో జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో అరంగేట్రం చేసి ఇప్పుడిప్పుడే ఆటలో ఓనమాలు నేర్చుకుంటున్న ఇటలీ క్రికెట్లో కలవరం! లైంగిక వేధింపుల ఆరోపణలు ఆ దేశ క్రికెట్ బోర్డును కుదిపేశాయి.
ఇటలీ మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ ఒకరు.. ఆ టీమ్ కో-ఆర్డినేటర్ ప్రభాత్ ఎక్నిలిగొడ తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేయడంతో ఫెడరేజియాన్ క్రికెట్ ఇటాలియానా (ఎఫ్సీఆర్ఐ) అతడిపై సస్పెన్షన్ వేటు వేసి విచారణకు ఆదేశించింది.