Donald Trump | AI కి కొత్త పేరు పెట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఇక నుంచి ఆ పేరుతోనే పిలువాలంట..!
Donald Trump | కృత్రిమ మేథస్సు (Artifician Intelligence) కు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త పేరు పెట్టారు. ఇకపై ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)’ కు బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ (SI)’ అనే పదాన్ని వాడాలని నిర్ణయించారు.
Donald Trump : కృత్రిమ మేథస్సు (Artifician Intelligence) కు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త పేరు పెట్టారు. ఇకపై ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)’ కు బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ (SI)’ అనే పదాన్ని వాడాలని నిర్ణయించారు. ‘ఆర్టిఫిషియల్’ అంటే నకిలీ అన్న భావన వస్తోందని, ఈ సాంకేతికత నిజమైనదే కాబట్టి ఆ పేరు సరైంది కాదని ట్రంప్ అన్నారు.
న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇకపై అమెరికా ప్రభుత్వ పత్రాల్లో ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పదమే కనిపిస్తుందని చెప్పారు. ఇతర దేశాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏఐపై ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ తీసుకురావాలన్న ప్రయత్నాలను ట్రంప్ వ్యతిరేకించారు. సాంకేతికత అభివృద్ధిని అడ్డుకునే అంతర్జాతీయ వ్యవస్థను అమెరికా అంగీకరించబోదని స్పష్టంచేశారు.
అయితే ఏఐతో కొత్త సవాళ్లు వస్తాయని చెప్పారు. అవసరమైనప్పుడు న్యాయశాఖ, చట్టాన్ని అమలుచేసే ఇతర సంస్థలు చర్యలు తీసుకుంటాయని తెలిపారు. అత్యాధునిక ఏఐ, రోబోలు మానవాళికి పెనుముప్పుగా మారొచ్చన్న హెచ్చరికలను ట్రంప్ కొట్టిపారేశారు. ఏఐ భవిష్యత్తులో పారిశ్రామిక విప్లవం, ఇంటర్నెట్ కంటే పెద్ద మార్పు తీసుకురావచ్చని అన్నారు. ఈ సాంకేతికత అభివృద్ధిని అడ్డుకునే చర్యలు తీసుకోబోమని చెప్పారు.
ఏఐలో ఏ దేశం ముందుంటే దానిదే ప్రపంచంలో పైచేయి అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ప్రస్తుతం చైనా కంటే చాలా ముందుందని అన్నారు. ఈ ఆధిక్యాన్ని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అయితే ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అనే పేరును అన్ని ఏఐ వ్యవస్థలకు వాడతారా..? అత్యాధునిక మోడళ్లకు మాత్రమే పరిమితం చేస్తారా..? అన్నది ట్రంప్ స్పష్టంగా చెప్పలేదు. ప్రభుత్వ శాఖల్లో ఈ మార్పు ఎలా అమలవుతుందన్నదానిపైనా వివరాలు వెల్లడించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

