Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
Y.S. Jagan | వైసీపీ సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టును వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.
అమరావతి : వైసీపీ సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ( Lella Appireddy) అక్రమ అరెస్టును వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( Y.S. Jagan Mohanreddy ) తీవ్రంగా ఖండించారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గమని , ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయమని ట్విటర్లో పేర్కొన్నారు.
గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారని, ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారని, అసలు బ్యాలెట్ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైందని ప్రశ్నించారు.
స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైసీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. తప్పులు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి , మళ్లీ తమ వాళ్లపై అక్రమకేసులు బనాయించడం దారుణమన్నారు.
చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని అన్నారు. కూటమి అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉందని, ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇలాంటి దుర్మార్గాలను సహించరు. మీకు తగిన బుద్ధిచెప్తారని జనగ్ పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Victory | గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి విజయం
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

