Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Parking Dispute: ఫరీదాబాద్ సెక్టార్ 21సీలో పార్కింగ్ వివాదం ఒకరి ప్రాణాలను బలిగొన్నది. పరమ్‌జీత్ ధంకర్ అనే వ్యక్తిని అపార్ట్‌మెంట్‌కు చెందిన మరో వ్యక్తి కాల్చి చంపాడు. నిందితుడిని మోహన్ అలియాస్ సోనూ శర్మగా గుర్తించారు.
ఫరీదాబాద్: ధంతేరాస్ రాత్రి వేళ ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. సెక్టార్ 21సీలో పార్కింగ్ వివాదం ఒకరి ప్రాణాలను బలిగొన్నది. పరమ్‌జీత్ ధంకర్ అనే వ్యక్తిని అపార్ట్‌మెంట్‌కు చెందిన మరో వ్యక్తి కాల్చి చంపాడు. నిందితుడిని మోహన్ అలియాస్ సోనూ శర్మగా గుర్తించారు. లైసెన్స్ పిస్తోల్‌తో అతను కాల్పులు జరిపినట్లు తేల్చారు. సుమారు 15 రౌండ్ల ఫైరింగ్ జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పరంజీత్‌కు నాలుగు బుల్లెట్లు దిగాయి. గతంలో పరంజీత్ టెక్ మహేంద్ర కంపెనీలో రీజినల్ హెడ్‌గా పనిచేశారు. అపార్ట్మెంట్లోని ఫస్ట్ ఫ్లోర్ 641 ఇంటి నెంబర్లో పరంజీత్ నివసిస్తున్నాడు. ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో అతను ఉద్యోగం చేస్తున్నాడు.
మేనల్లుడి పెళ్లి కోసం రెండు రోజుల క్రితం అతను ఫరీదాబాద్ చేరుకున్నాడు. నవంబర్ 24వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు జిమ్ నుంచి తిరిగివచ్చిన పరంజీత్, మోహన్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ బిల్డింగ్‌లోనే మూడవ ఫ్లోర్లో మోహన్ నివసిస్తున్నాడు. అయితే వెహికల్ పార్కింగ్ గురించి గొడవ జరిగిందా లేక పెంపుడు కుక్క గురించి ఘర్షణ మొదలైందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాగ్వదం ముదరడంతో.. మోహన్ తన వద్ద ఉన్న గన్‌తో పరంజీత్‌ను షూట్ చేశాడు.
పోలీసుల ప్రకారం ఆ రెండు కుటుంబాల మధ్య చాన్నాళ్ల నుంచి గొడవలు ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితమే పరంజీత్ కుమారుడిని మోహన్ తిట్టినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటన తర్వాత మోహన పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

