ముంబై: ఒక ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది. (Wedding Invite On WhatsApp) ఆ వ్యక్తి ఆ ఫైల్‌ను ఓపెన్ చేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు అతడి మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేశారు. అతడి బ్యాంకు ఖాతా నుంచి సుమారు రెండు లక్షలు కొల్లగొట్టారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన వ్యక్తికి వాట్సాప్‌లో వెడ్డింగ్ ఇన్విటేషన్ మెసేజ్ వచ్చింది. ‘వెల్కమ్. 30/08/2025న వివాహానికి తప్పక రావాలి. ప్రేమ అనేది ఆనంద ద్వారం తెరిచే మాస్టర్ కీ’ అని అందులో ఉన్నది. అలాగే వివాహ ఆహ్వానానికి సంబంధించిన ఫైల్‌ను సెండ్ చేశారు.
Wedding Invitation
కాగా, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ (ఏపీకే) ఫైల్‌ను ఆ ప్రభుత్వ ఉద్యోగి ఓపెన్ చేశాడు. దీంతో సైబర్ నేరస్తులు ఆయన మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేశారు. ఫోన్లోని డేటాను యాక్సెస్ చేశారు. ఆ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.1,90,000 దొంగిలించారు.
మరోవైపు సుమారు రెండు లక్షలు పోగొట్టుకున్న ఆ ప్రభుత్వ ఉద్యోగి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ మోసంపై హింగోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సైబర్ సెల్ విభాగం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Watch: పిజ్జా షాపులో ప్రియుడితో ఉన్న సోదరి.. ఆమె సోదరుడు ఏం చేశాడంటే?
Watch: ఏటీఎం నుంచి డబ్బులు చోరీకి దొంగ యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?