బెంగళూరు: బ్యాంకు ఏటీఎంను ఒక దొంగ ధ్వంసం చేశాడు. అందులో ఉన్న డబ్బును చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. (thief stealing money at ATM) ఈ సమాచారం తెలుసుకున్న ఒక పోలీస్ అధికారి వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం అర్థరాత్రి బళ్లారిలోని కలమ్మ సర్కిల్ సమీపంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను ఒక వ్యక్తి పగులగొట్టాడు. అందులో ఉన్న క్యాష్ బాక్స్ చోరీ చేసేందుకు ప్రయత్నించాడు.
కాగా, పోలీసులకు ఈ సమాచారం తెలిసింది. దీంతో రాత్రి వేళ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఏఎస్ఐ మల్లికార్జున వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఏటీఎం చోరీకి పాల్పడిన దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీస్ అధికారిపై ఆ వ్యక్తి తిరుగబడ్డాడు. దీంతో ఏఎస్ఐ మల్లికార్జున ఆ దొంగతో కొంతసేపు పోరాడారు. ఇతర పోలీస్ సిబ్బందిని ఆయన అలెర్ట్ చేశారు.
మరోవైపు కొంతమంది పోలీసులు ఆ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. చివరకు ఆ దొంగను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌ను తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో నివసించే వెంకటేష్‌గా నిందితుడ్ని గుర్తించారు. అయితే ఏటీఎం వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ATM चोर की किस्मत ही ख़राब थी
बेचारा रंगेहाथ पकड़ा गया #Karnataka pic.twitter.com/zvOXPZchoF— Gaurav Pandit (@igauravpandit) August 13, 2025
Also Read:
tiger cubs died of starvation | తల్లి నుంచి విడిపోయిన పులి పిల్లలు.. ఆకలి, దప్పికతో మృతి
Cat Kumar | బీహార్‌లో నివాస ధృవీకరణ పత్రం కోసం.. ‘క్యాట్ కుమార్’ దరఖాస్తు
Watch: ఎదురుపడిన మనిషి, సింహం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?