న్యూఢిల్లీ: మనిషి, సింహం హఠాత్తుగా ఎదురుపడ్డారు. ఒకరినొకరు భయపెట్టుకున్నారు. దీంతో ఆ మనిషి వెనక్కు పరుగెత్తగా, ఆ సింహం కూడా వెనక్కి పారిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Man, Lion Scares Each Other) ఒక వ్యక్తి రాత్రివేళ ఇంటి ఆవరణలో నడిచాడు. ఇంటి వెనుకకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.
కాగా, ఆడ సింహం ఆ ఇంటి వెనుక వైపు నడుస్తూ వస్తున్నది. దీంతో ఆ వ్యక్తి, సింహం ఒక్కసారిగా ఎదురుపడ్డారు. అయితే ఆ వ్యక్తితో పాటు సింహం కూడా భయపడింది. ఆ వ్యక్తి ఇంట్లోకి పరుగెత్తగా సింహం అక్కడి నుంచి పారిపోయింది. ఆగస్ట్ 6న ఈ సంఘటన జరిగింది.
మరోవైపు ఆ ఇంటి ఆవరణలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. మనిషి, సింహం ఒకరినొకరు భయపెట్టుకోవడం అరుదైన సంఘటన అని ఒకరు, మనిషి కంటే ఆ సింహం ఎక్కువగా భయపడిందని మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనను జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలని ఒకరు చమత్కరించారు.
Man and lion sudden faceoff what would your reaction be? pic.twitter.com/Nfiu2bp8ut
— Nikhil saini (@iNikhilsaini) August 9, 2025
Also Read:
Watch: జ్యువెలరీ షాపు సిబ్బందిపై యాసిడ్ చల్లి.. నగలు చోరీకి దొంగలు యత్నం
Watch: విద్యార్థితో పాదానికి మసాజ్ చేయించుకున్న టీచర్.. వీడియో వైరల్