బెంగళూరు: పోలీస్ కస్టడీలో ఉన్న దొంగ భార్యను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించాడు. పోలీస్ డ్రెస్ ధరించి వీడియో కాల్ చేసి భార్యతో మాట్లాడాడు. (Thief Wears Police Uniform) ఏడాది తర్వాత ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సలీమ్ షేక్ అలియాస్ బాంబే సలీమ్‌పై 50కు పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. 2024లో గోవిందపుర స్టేషన్ పోలీసులు ఒక చోరీ కేసులో సలీమ్‌ను అరెస్ట్ చేశారు. దొంగిలించిన నగలు, చీరలు, విలువైన వస్తువుల స్వాధీనం కోసం బెంగళూరు వెలుపలకు అతడ్ని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఒక హోటల్లో ఉంచారు.
కాగా, పోలీస్ కానిస్టేబుల్ హెచ్ఆర్ సోనార్, మరో కానిస్టేబుల్ కలిసి పోలీస్ కస్టడీలో ఉన్న సలీమ్‌ను హోటల్ రూమ్‌లో ఉంచి లాక్ చేశారు. వారిద్దరూ కలిసి షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. అయితే ఆ రూమ్‌లో ఉన్న సోనార్ పోలీస్ డ్రెస్‌ను సలీమ్ ధరించాడు. భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఈ స్క్రీన్‌షాట్ తీసుకున్నాడు.
మరోవైపు ఈ ఏడాది జూన్ 23న ఇందిరానగర్ ప్రాంతంలో జరిగిన చోరీపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ ఫోన్ డేటాను పరిశీలించారు. ఈ చోరీకి పాల్పడిన ముఠాలో సలీమ్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, సలీమ్ మొబైల్ ఫోన్ డేటాను ఇందిరానగర్ పోలీసులు చెక్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ డ్రెస్ వేసుకుని భార్యతో మాట్లాడిన వాట్సాప్ వీడియో కాల్ స్క్రీన్ షాట్‌ను గుర్తించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో నాడు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ కానిస్టేబుల్ హెచ్ఆర్ సోనార్‌ను సస్పెండ్ చేశారు.
Also Read:
Karnataka horror | తెగిన తల, పలు చోట్ల శరీర భాగాలు.. మహిళ హత్యపై పోలీసులు దర్యాప్తు