భోపాల్: టీనేజ్ కూతురుపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి ఆ శిశువును చెట్లపొదల్లో పడేసి పారిపోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Man Arrested For Raping Daughter) మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో చెట్లపొదల వద్ద చీమలు కుడుతున్న శిశువును స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ శిశువుకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, చెట్ల పొదల్లో శిశువును పారవేయడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 16 ఏళ్ల బాలిక ఆ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుసుకున్నారు. క్లినిక్‌లో చికిత్స పొందుతున్న ఆమెను ప్రశ్నించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పని చేసినప్పుడు తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ బాలిక ఆరోపించింది. గర్భం దాల్చడంతో ఇంటి వద్ద కాన్పు చేయించాడని తెలిపింది. తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు శిశువును ఎత్తుకెళ్లి చెట్ల పొదల్లో పడేసి పారిపోయాడని చెప్పింది.
మరోవైపు నిందితుడి కోసం పోలీసులు వెతికారు. శుక్రవారం అతడ్ని అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ శిశువుకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. శిశువు, జన్మనిచ్చిన బాలిక, నిందితుడి డీఎన్ఏ నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు వెల్లడించారు.
Also Read:
Woman Kills Her Newborn | ప్రసవం తర్వాత బిడ్డను చంపిన తల్లి.. శిశువు మృతదేహాన్ని చెత్తలో పారవేత
Wall Collapses | భారీ వర్షానికి కూలిన గోడ.. పిల్లలు, మహిళలతో సహా ఏడుగురు మృతి
Election Commission | 334 రాజకీయ పార్టీలను.. జాబితా నుంచి తొలగించిన ఈసీ