న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 334 రాజకీయ పార్టీలను రిజిస్టర్ జాబితా నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) తొలగించింది. 2019 నుంచి ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని ఈ రాజకీయ పార్టీలపై ఈ నిర్ణయం తీసుకున్నది. (Election Commission) ఈసీ వద్ద రిజిస్టర్ అయినప్పటికీ గుర్తింపులేని 334 రాజకీయ పార్టీలు 2019 నుంచి ఆరేళ్లలో ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని ఈసీ తెలిపింది. ముఖ్యమైన ఈ షరతును నెరవేర్చడంలో విఫలమైనందుకు రిజిస్టర్ అయిన 334 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు శనివారం పేర్కొంది.
కాగా, గుర్తింపు లేని ఈ 334 రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవని ఈసీ తెలిపింది. అయితే జాబితా నుంచి తొలగించిన ఈ పార్టీల కార్యాలయాలు భౌతికంగా కూడా ఎక్కడా లేవని పేర్కొంది. మొత్తం 2,854 నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీల్లో 334 పార్టీల తొలగింపు తర్వాత 2,520 రాజకీయ పార్టీలు రిజిస్టర్ జాబితాలో ఉన్నట్లు ఈసీ వివరించింది. ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర పార్టీలు ఉన్నాయని వెల్లడించింది.
Also Read:
Income Tax Bill 2025 | ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ.. ఆగస్ట్ 11న కొత్త వెర్షన్ బిల్లు ప్రవేశం
Man Kills Wife With 2 Lovers | ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి.. భార్యను హత్య చేసిన భర్త
Watch: జ్యువెలరీ షాపు సిబ్బందిపై యాసిడ్ చల్లి.. నగలు చోరీకి దొంగలు యత్నం