భువనేశ్వర్: ఒక వ్యక్తి తన ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి భార్యను హత్య చేశాడు. ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అత్త ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ వ్యక్తిని, ఇద్దరు ప్రియురాళ్లను అరెస్ట్ చేశారు. (Man Kills Wife With 2 Lovers) ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెల్లగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని నుగావ్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల సంతోష్ నాయక్ రోజువారీ కూలీ. 28 ఏళ్ల భార్య పూజతో 12 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కాగా, సంతోష్ నాయక్‌కు ఇద్దరు ప్రియురాళ్లు ఉన్నారు. 26 ఏళ్ల అనితా నాయక్, 21 ఏళ్ల శ్రుతి పరిదాతో అతడికి వివాహేతర సంబంధం ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 4న పూజా అనుమానాస్పదంగా మరణించింది.
మరోవైపు తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని పూజా తల్లి శాంతికి సంతోష్ సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమె హుటాహుటిన కుమార్తె ఇంటికి చేరుకున్నది. కూతురు పూజ మృతదేహాన్ని గుడ్డలో చుట్టి నేలపై ఉంచడాన్ని ఆమె గమనించింది. అయితే అత్తను తన ఇంట్లోకి సంతోష్ అనుమతించలేదు. ఆమె కుమార్తె మృతదేహాన్ని దగ్గర నుంచి చూడనివ్వలేదు.
కాగా, పూజా తల్లి శాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లుడు సంతోష్‌కు ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం ఉన్నదని, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలో వారిద్దరితో కలిసి తన కుమార్తెను సంతోష్ హత్య చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.
మరోవైపు పూజా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో సంతోష్, అతడి ఇద్దరు ప్రియురాళ్లైన అనిత, శ్రుతిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Couple Fight Turns Violent | హింసాత్మకంగా మారిన దంపతుల ఫైట్.. భర్త మృతి, భార్యకు కత్తి గాయాలు
Income Tax Bill 2025 | ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ.. ఆగస్ట్ 11న కొత్త వెర్షన్ బిల్లు ప్రవేశం
Watch: జ్యువెలరీ షాపు సిబ్బందిపై యాసిడ్ చల్లి.. నగలు చోరీకి దొంగలు యత్నం