న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు 2025ను (Income Tax Bill 2025) కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. సెలెక్ట్ కమిటీ సిఫార్సులతో ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు కొత్త వెర్షన్‌ను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే 4,500 పేజీలకు పైగా ఉన్న ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 285 సూచనలు చేశాయి. దీంతో సెలక్ట్ కమిటీకి ఈ బిల్లును పంపారు.
కాగా, ఈ కమిటీ జూలై 21న పార్లమెంటుకు తన నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో
ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకున్నది.
మరోవైపు సెలెక్ట్ కమిటీ చేసిన సిఫార్సులతో ఆదాయపు పన్ను బిల్లు 2025 కొత్త వెర్షన్‌ను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ ఎంపీ, సెలక్ట్ కమిటీ అధ్యక్షుడు బైజయంత్ జే పాండా తెలిపారు. కొత్త చట్టాన్ని ఆమోదించిన తర్వాత దశాబ్దాల నాటి పన్ను నిర్మాణాన్ని సులభతరం చేస్తుందని, చట్టపరమైన గందరగోళాన్ని తగ్గిస్తుందని చెప్పారు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, ఎంఎస్ఎంఈలకు సంబంధించిన అనవసరమైన వ్యాజ్యాలను నివారించడానికి కొత్త ఆదాయ పన్ను బిల్లు సహాయపడుతుందని వెల్లడించారు.
Also Read:
DK Shivakumar | ఫ్లైఓవర్‌పై స్కూటి నడిపిన డీకే శివకుమార్.. ఆ బైక్‌పై రూ.18,500 ట్రాఫిక్ చలాన్లు
Watch: మాజీ డిప్యూటీ సీఎం ఇంటి నుంచి.. ఇత్తడి ఏనుగు విగ్రహం చోరీ చేసిన దొంగ
Watch: జ్యువెలరీ షాపు సిబ్బందిపై యాసిడ్ చల్లి.. నగలు చోరీకి దొంగలు యత్నం