బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌పై బైక్ నడిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఆ వంతెనను ఆయన పరిశీలించారు. ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆయన నడిపిన బైక్‌పై రూ.18,500 ట్రాఫిక్ జరిమానా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆగస్ట్ 3న డీకే శివకుమార్ బైక్ నడిపారు. హెల్మెట్ ధరించి బైక్ నడిపిన ఆయన బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. ఆయన వెనుక మంత్రి బైరతి సురేష్ కూర్చొన్నారు. ‘హెబ్బాల్ ఫ్లైఓవర్ లూప్ తెరువడానికి సిద్ధంగా ఉన్నది. ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. సజావుగా, వేగవంతమైన ప్రయాణాలకు ఉపయోగపడుతుంది. మెరుగైన బెంగళూరును నిర్మించాలనే మా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఫ్లైఓవర్‌పై బైక్ నడిపిన వీడియో క్లిప్‌ను అందులో పోస్ట్ చేశారు.
కాగా, డీకే శికుమార్ నడిపిన బైక్‌పై రూ.18,500 ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్‌లో ఉన్నాయి. బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్ ప్రకారం ఆ బైక్‌పై 34 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఆగస్ట్ 3న కూడా హాఫ్ హెల్మెట్ ధరించినందుకు అదనంగా రూ.500 జరిమానా కూడా విధించారు.
మరోవైపు కర్ణాటకలో ప్రతిపక్షమైన బీజేపీ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ‘గౌరవనీయులైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్రంలో మీకు ఒక చట్టం, సామాన్యులకు మరొక చట్టం ఉన్నదా?’ అని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించింది.
The Hebbal flyover loop is set to open, easing traffic congestion and ensuring smoother and faster commutes as part of our government’s commitment to building a better Bengaluru.#HebbalFlyover pic.twitter.com/HotJ61mUpx
— DK Shivakumar (@DKShivakumar) August 5, 2025
Also Read:
Fadnavis-Shinde Rift Buzz | ఫడ్నవీస్, షిండే మధ్య విభేదాలు?.. ఒకే పదవికి రెండు నియామకాలు
Watch: కారు నడిపిన బాలుడు.. టైరు కింద నలిగి రెండేళ్ల బాలుడు మృతి