భోపాల్: విద్యార్థి అయిన ఒక బాలుడు కారు నడిపాడు. అయితే ఆ టైరు కింద నలిగి రెండేళ్ల బాలుడు మరణించాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Student Runs Car Over 2 Year Old Boy) మధ్యప్రదేశ్లోని రత్లాంలో ఈ సంఘటన జరిగింది. 16 ఏళ్ల బాలుడు 12వ తరగతి చదువుతున్నాడు. అల్కాపురి ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
కాగా, ఆ బాలుడి తండ్రి సురేంద్ర ప్రతాప్ రాథోడ్ గ్రామం నుంచి రత్లాంకు కారులో చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడు తన తండ్రి నుంచి కారు కీ తీసుకున్నాడు. ఇరుకైన వీధిలో కారు డ్రైవ్ చేశాడు.
మరోవైపు ఆ వీధిలోని కుటుంబానికి చెందిన రెండేళ్ల బాలుడు నానమ్మ చేతుల్లోంచి కిందకు దిగాడు. పరుగెత్తుకుని రోడ్డు మీదకు వచ్చాడు. అయితే మైనర్ బాలుడు మెల్లగా నడుపుతున్న కారు ఆ చిన్నారి మీద నుంచి వెళ్లింది. దీంతో కారు టైరు కింద నలిగి చనిపోయాడు. ఇది చూసి చిన్నారి నానమ్మ కేకలు వేసింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. మైనర్ బాలుడితోపాటు అతడి తండ్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
वायरल वीडियो मध्य प्रदेश के रतलाम जिले का है, जिसे देखकर आपका भी दिल दहल जाएगा. यहां एक 16 साल के नाबालिक ने दो साल के बच्चे पर कार चढ़ा दी, जिससे मासूम बच्चे की मौत हो गई. pic.twitter.com/AknbUgYQzZ
— Abhishek Kumar (@pixelsabhi) August 7, 2025
Also Read:
Fadnavis-Shinde Rift Buzz | ఫడ్నవీస్, షిండే మధ్య విభేదాలు?.. ఒకే పదవికి రెండు నియామకాలు
Disguised As Sadhu, Man Kills Wife | పదేళ్ల తర్వాత సాధువు వేషంలో వెళ్లి.. భార్యను చంపిన వ్యక్తి