ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. (Fadnavis-Shinde Rift Buzz) ఒకే రోజు ఒకే పోస్ట్ కోసం రెండు డిపార్ట్మెంట్లు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. బృహన్ ముంబై విద్యుత్ సరఫరా, రవాణా (బెస్ట్) సంస్థ కార్మిక సంఘం నిరసన చేపట్టింది. ఈ నేపథ్యంలో జూలై 31న జనరల్ మేనేజర్ ఎస్వీఆర్ శ్రీనివాస్ పదవీ విరమణ చేశారు. దీంతో బెస్ట్ జనరల్ మేనేజర్ పదవి భర్తీ కోసం ఆగస్టు 5న మహారాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే పదవికి ఇద్దరు అధికారులను నియమించింది.
కాగా, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని పట్టణాభివృద్ధి శాఖ తొలుత అశ్విని జోషిని బెస్ట్ కొత్త జనరల్ మేనేజర్‌గా నియమించింది. కొన్ని గంటల తర్వాత సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఐఏఎస్ అధికారి ఆశిష్ శర్మను అదే పదవికి నియమిస్తూ మరో సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఫడ్నవీస్, షిండే మధ్య విభేదాలున్నట్లు మరోసారి బయటపడింది.
మరోవైపు ఈ గందరగోళంపై సీఎం ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు. బెస్ట్‌కు సంబంధించి తాను నిర్ణయాలు తీసుకోనని, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తీసుకుంటుందని తెలిపారు. ఆ తర్వాత షిండే నేతృత్వంలోని పట్టణాభివృద్ధి శాఖ కూడా దీనిపై స్పందించింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రెగ్యులర్ నియామకం జరిగే వరకు అశ్విని జోషికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది.
కాగా, బెస్ట్ కొత్త జనరల్ మేనేజర్ నియామకంలో తలెత్తిన ఈ గందరగోళంపై కార్మిక సంఘాలతో పాటు ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం షిండే మధ్య నెలకొన్న విభేదాలను ఇది స్పష్టం చేసిందని విమర్శించాయి.
Also Read:
Watch: మాజీ డిప్యూటీ సీఎం ఇంటి నుంచి.. ఇత్తడి ఏనుగు విగ్రహం చోరీ చేసిన దొంగ
Disguised As Sadhu, Man Kills Wife | పదేళ్ల తర్వాత సాధువు వేషంలో వెళ్లి.. భార్యను చంపిన వ్యక్తి
Swami Prasad Maurya | మాజీ మంత్రి చెంపపై కొట్టిన కర్ణిసేన కార్యకర్త.. తర్వాత ఏం జరిగిందంటే?