లక్నో: కర్ణిసేనకు చెందిన కార్యకర్త మాజీ మంత్రి చెంపపై కొట్టాడు. (Swami Prasad Maurya) దీంతో ఆయన అనుచరులు అతడ్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాజీ మంత్రి, లోక్ మోర్చా చీఫ్ స్వామి ప్రసాద్ మౌర్య బుధవారం కారులో వెళ్తూ ఫతేపూర్‌లోని సరస్ క్రాసింగ్ వద్ద ఆగారు. దీంతో ఆయన అభిమానులు, మద్దతుదారులు పూల దండలతో స్వాగతం పలికారు.
కాగా, ఈ సందర్భంగా కర్ణిసేనకు చెందిన ఒక వ్యక్తి చేతిలో పూలమాలతో వెనుక నుంచి స్వామి ప్రసాద్ మౌర్య వద్దకు చేరుకున్నాడు. ఆయన మెడలో ఆ దండ చేశాడు. ఆ తర్వాత వెనుక నుంచి స్వామి ప్రసాద్ మౌర్య చెంపపై కొట్టాడు. ఆ తర్వాత కర్ణిసేన కార్యకర్త అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే స్వామి ప్రసాద్ మద్దతుదారులు అతడ్ని పట్టుకుని కొట్టారు. అక్కడున్న పోలీసులకు అప్పగించారు.
మరోవైపు ఈ దాడిపై స్వామి ప్రసాద్ మౌర్య స్పందించారు. కర్ణిసేనకు రాజకీయ రక్షణ లభిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ సంస్థ గూండాలు బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. పోలీసుల ముందే ఇలాంటి దాడులు చేస్తే పోలీసులు లేకపోతే పరిస్థితి ఏమిటన్నది ఆలోచించాలని అన్నారు. బీజేపీని తొలగించాలి, యూపీని రక్షించాలన్న నినాదంతో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
VIDEO | Raebareli: A person tried to slap former UP minister Swami Prasad Maurya during a public event. The accused was later thrashed by the supporters of the leader before the police detained him. #UPNews #UttarPradeshNews
(Full video available on PTI Videos -… pic.twitter.com/OyXIJnyjOa
— Press Trust of India (@PTI_News) August 6, 2025
Also Read:
Sanjay Nishad | మీ ఇంటి గుమ్మం వద్దకే గంగా నది వచ్చిందన్న మంత్రి.. మీరే ఆశీర్వాదం తీసుకోవాలన్న మహిళ
Dalit Woman Gang Raped | స్నేహితుడ్ని అడ్డుకుని.. దళిత మహిళపై సామూహిక అత్యాచారం
Cop Hacked To Death | తండ్రీ, కొడుకుల మధ్య గొడవ.. జోక్యం చేసుకున్న పోలీస్ అధికారిని నరికి చంపారు