మెహిదీపట్నం మార్చి 5: నిర్మాణ భవనంపై నుంచి నలుగురు కిందపడగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన టోలిచౌకి అల్హస్నత్ కాలనీలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..టోలిచౌకి అల్ హస్నత్ కాలనీలో యునైటెడ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి చెందిన నాసర్ సులేమాన్ 300 గజాల స్థలంలో భవనం నిర్మిస్తున్నాడు. జీ ప్లస్ 3 అంతస్తులకు అనుమతి తీసుకొని 7 అంతస్తులు నిర్మిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేస్త్రీ ఆదినారాయణ(50),తిరుపతిరావు(31), విజయనగరం జిల్లాకు చెందిన రమేశ్, ఎం రమేశ్ ఏడో అంతస్తులో పనులు చేస్తున్నారు. సపోర్టింగ్ కట్టిన గోవా కట్టెలు బరువుకు తెగిపోవడంతో నలుగురు కింద పడ్డారు.
దీంతో ఆదినారాయణ,తిరుపతిరావు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే క్రమంలో పాతబస్తీ బండ్ల గూడకు చెందిన లాల్ అహ్మద్ ఖాన్ తన ఆటోతో భవనం బయట ఆగి ఉండగా ఇద్దరు ఆటోపై పడ్డారు. దీంతో ఆటోలో ఉన్న లాల్ అహ్మద్ ఖాన్‌కు గాయాలయ్యాయి. ఆసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్‌కుమార్,మెహిదీపట్నం ఇన్స్పెక్టర్ మల్లేశ్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. గోల్కొండ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ ఏసీపీ స్వామి నాయక్,సెక్షన్ ఆఫీసర్ ప్రభావతి సంఘటనా స్థలానికి వచ్చి బిల్డర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి:ఎమ్మెల్సీ దాసోజుశ్రవణ్
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుం ద న్నారు. బాధితులకు న్యాయం చేయాలని కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా అందిం చాలని , క్షతగాత్రుల చికిత్సకోసం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని డి మాండ్ చేశారు.