BCCI | ఆసియా కప్ నుంచి జెమీమా ఔట్.. భారత స్క్వాడ్‌లోకి వరల్డ్‌కప్ ఓపెనర్..!
BCCI : భారత మహిళల క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆసియా క్రీడలు, ఆసియా కప్ వంటి మెగా టోర్నీలకు జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) దూరమైంది.
BCCI : భారత మహిళల క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆసియా క్రీడలు, ఆసియా కప్ వంటి మెగా టోర్నీలకు జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) దూరమైంది. టీమిండియా తొలి వరల్డ్‌కప్ విజయంలో కీలకమైన జెమీమా తొడ కండరాల గాయం కారణంగా ఈ రెండు ఈవెంట్లకు అందుబాటులో ఉండడం లేదని శుక్రవారం బీసీసీఐ వెల్లడించింది. ఈ మిడిలార్డర్ బ్యాటర్ స్థానంలో వరల్డ్‌కప్ ఓపెనర్ ప్రతీకా రావల్(Pratika Rawal)ను ఏసీసీ ఆసియా కప్ కోసం ఎంపిక చేశారు సెలెక్టర్లు.
నిరుడు సొంతగడ్డపై భారత జట్టు వన్డే ప్రపంచకప్ కలను సాకారం చేసిన జెమీమా రోడ్రిగ్స్ అనూహ్యంగా ఆసియా కప్, ఆసియా క్రీడలకు దూరమైంది. ది హండ్రెడ్ లీగ్‌లో గాయపడిన జెమీమా నెల రెండు నెలల్లో కోలుకునే పరిస్థితిలో లేదు.
A look at #TeamIndia‘s squad for the upcoming ACC Women’s Asia Cup 2026 🙌#ACC | #WomensAsiaCup2026 pic.twitter.com/a7fVxTjMMI
— BCCI Women (@BCCIWomen) August 14, 2026
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని వైద్య బృందం.. జెమీమా గాయం తీవ్రతను పరీక్షించారు. ఆమెకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని తేల్చారు. దాంతో, ప్రతీకా రావల్‌ను ఆసియా కప్ స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు. అలానే ఆగస్టు 28 నుంచి యూఏఈలో ఆసియా కప్ మొదలవ్వనుంది. అందరూ ఆసక్తి కనబరిచే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 5న జరుగనుంది. అనంతరం సెప్టెంబర్ 17 నుంచి జపాన్ వేదికగా ఆసియా క్రీడలు షురూ కానున్నాయి.
ఆసియా క్రీడల స్క్వాడ్: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, షఫాలీ వర్మ, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రీచా ఘోష్(వికెట్ కీపర్), జి.కమలిని(వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, నందిని శర్మ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

