Rahul Sipligunj | రాహుల్ సిప్లిగంజ్ నన్ను బెదిరించలేదు.. తప్పుడు ప్రచారం నమ్మవద్దు.. విశాఖ యువతి క్లారిటీ!
Big Twist In Vizag Case | విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపిన రాహుల్ రెడ్డి కేసు వ్యవహారం ప్రస్తుతం ఒక ముగింపునకు వచ్చింది. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బావమరిది అయిన రాహుల్ రెడ్డిపై ప్రేమ, పెళ్లి నెపంతో మోసం చేశారంటూ గతంలో ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Big Twist In Vizag Case | విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపిన రాహుల్ రెడ్డి కేసు వ్యవహారం ప్రస్తుతం ఒక ముగింపునకు వచ్చింది. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బావమరిది అయిన రాహుల్ రెడ్డిపై ప్రేమ, పెళ్లి నెపంతో మోసం చేశారంటూ గతంలో ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట్లో ఈ వివాదంలోకి రాహుల్ సిప్లిగంజ్ పేరు రావడం, ఆయన బెదిరింపులకు పాల్పడ్డారనే ప్రచారం జరగడంతో ఈ అంశం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే ఇటీవల ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధితురాలు మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ఉన్న అసలు నిజాలను బయటపెట్టింది.
తనకు, రాహుల్ రెడ్డికి మధ్య నడిచింది కేవలం వ్యక్తిగత విషయమని, ఇందులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఎలాంటి సంబంధం గానీ, ప్రమేయం గానీ లేదని ఆమె స్పష్టం చేసింది. రాహుల్ రెడ్డికి బంధువు కావడం వల్లే రాహుల్ సిప్లిగంజ్ పేరును కొంతమంది బలవంతంగా ఈ వివాదంలోకి లాగారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు తనను తీవ్రంగా మానసిక వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి కొన్ని వీడియోలు చేయించారని, ఆ తర్వాత ఆ వీడియోలు, ఆడియోలను తమకు అనుకూలంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆమె వివరించింది.
అంతేకాకుండా, తనను హనీట్రాప్ కేసులో ఇరికించి జీవితాన్ని నాశనం చేస్తామని, ప్రభుత్వం మరియు పోలీసుల పేర్లను వాడుకుంటూ కొందరు ముఠాగా ఏర్పడి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. జరగని విషయాలను జరిగినట్లుగా చిత్రీకరించి సమాజంలో తన క్యారెక్టర్‌ను తక్కువ చేసి చూపేందుకు కుట్ర పన్నారని వాపోయింది. అయితే, రాహుల్ రెడ్డికి తనకు మధ్య ఉన్న విభేదాలను ఇద్దరం కూర్చుని మాట్లాడి, పరస్పర అంగీకారంతో సమసిపోయేలా చేసుకున్నామని తెలిపింది. ఇప్పటికే కోర్టులో దాఖలు చేసిన కేసును కూడా పూర్తిగా వెనక్కి తీసుకున్నామని, చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తయ్యాయని ఆమె స్పష్టం చేసింది. ఈ స్పష్టతతో రాహుల్ సిప్లిగంజ్‌పై వస్తున్న ఆరోపణలన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

