హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం పకన నానక్‌రామ్‌గూడలో ఉన్న సర్వే నంబర్లు 112, 114లోని మూడెకరాల ప్రైవేట్ భూమిలో అధికారులు ఎలాంటి జోక్యం చేసుకోవద్దని హైకోర్టు స్పష్టంచేసింది. గతం లో ఈ భూమికి సంబంధించి చేపట్టిన భూసేకరణ ప్రక్రియను హైకోర్టు రద్దు చేయగా, ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
అయినప్పటికీ రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు భూమి చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారని ఆరోపిస్తూ ప్రైవేట్ వ్యక్తులు వేర్వేరుగా రెండు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారించిం ది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రైవేట్ వ్యక్తుల భూమిలో అధికారులు జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది.