హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తమ కుటుంబానికి సంబంధించిన భూముల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణలు సత్యదూరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే నవీన్‌కుమార్ తెలిపారు. తనతోపాటు తండ్రి కొండల్‌రావుపై చేసిన ఆరోపణలను గురువారం ఒక ప్రకటనలో ఖండించారు.
2019, 2023 ఎన్నికల సమయంలో భూములు, ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో అధికారికంగా ప్రకటించానని గుర్తుచేశారు. తనపేరిట ఉన్న మెజారిటీ భూములు తెలంగాణ ఏర్పాటుకు ముందే, 2014కు పూ ర్వమే కొనుగోలు చేసినవని స్పష్టంచేశారు. అప్పట్లో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని పేర్కొన్నారు. తమ కుటుంబానికి చెందిన భూములకు ధరణి ఎంట్రీలు, 22ఏ నిషేధిత జాబితాతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.