మేడ్చల్, మార్చి 5(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో అత్యవసర వైద్య సేవల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ‘వన్ హెల్త్ అంబులెన్స్’ సేవలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటికి పైగా జనాభా, 500కు పైగా వైద్యశాలలు ఉన్న నగరంలో 37 వేల మందికి ఒక అంబులెన్స్ మాత్రమే అందుబాటులో ఉందన్నారు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో అంబులెన్స్ రావడానికి 40 నుంచి 50 నిమిషాలు పడుతుందన్నారు. ఈ అంతరాన్ని పూరించడానికి, వేగవంతంగా, నమ్మకమైన సేవలను అందించడానికి వన్ హెల్త్ అంబులెన్స్ ను తీసుకువచ్చామన్నారు.
వృత్తి పరమైన నిర్వహణ, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ అంబులెన్స్ సర్వీసు ప్రమాద సమయాల్లో స్పందించే సమయాన్ని తగ్గించి, ఆస్పత్రికి చేరక ముందే బాధితులకు నాణ్యవంతమైన అత్యవసర చికిత్స అందిస్తుందన్నారు. నగరంలోని ప్రజలు వన్ అంబులెన్స్ సేవలను కోసం 9734108108 కాల్ చేయాలని ఆయన సూచించారు. బీఎల్ఎస్(బేసిక్ లైన్ సపోర్ట్) అంబులెన్స్ రోగుల బదిలీ, సాధారణ అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందిస్తాయన్నారు. ఏఎల్ఎస్(అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్) క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే అత్యాధునిక పరికాలు, శిక్షణ పొందిన పారా మెడికల్స్తో కూడిన సేవలు అందిస్తాయన్నారు.
5జీ సాంకేతికత అంబులెన్స్‌లో లైఫ్ఫీడ్, రోగి కీలక ఆరోగ్య సంకేతాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించే సుదపాయం త్వరలో యాప్ ఆధారిత బుకింత్, లైవ్ ట్రాకింగ్, ఎస్‌వోఎస్ బటన్, లైవ్ ట్రాకింగ్ సౌకర్యంతో కూడిన మొబైల్ అప్లికేషన్ త్వరలో అందుబాటులో రానుందన్నారు. మల్కాజిగిరి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బాచుపల్లి, మణికొండ, శామీర్‌పేట, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, ఈసీఐఎల్, మియాపూర్, పంజాగుట్ట తందితర ప్రధాన నివాస, పారిశ్రామిక ప్రాంతాల్లో వన్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయని మల్లారెడ్డి చెప్పారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్‌కు దరఖాస్తుల ఆహ్వానం
మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 5: బెస్ట్ అవైలబుల్ స్కూల్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బెస్ట్ స్కూల్ స్కీం ద్వారా 2026-27 విద్యా సంవత్సరంలో 1వ తరగతి డే స్కాలర్, 5వ తరగతి రెసిడెన్షియల్‌కు షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన విద్యార్థులు అర్హులని, విద్యార్థులను చేర్చుకొనుటకు ఆసక్తిగల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని అన్నారు. ఈనెల 25వ తేదిలోపు దరఖాస్తులను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో అందించాలని సూచించారు.