లక్నో: వరదలు ముంచెత్తిన ప్రాంతాన్ని మంత్రి సందర్శించారు. మీ ఇంటి వద్దకే గంగా నది వచ్చిందని, పాదాలు శుద్ధి చేసిందని ఒక మహిళతో ఆయన అన్నారు. (Sanjay Nishad) మిమ్మల్ని నేరుగా స్వర్గానికి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. అయితే ‘గంగా ఆశీర్వాదం మీరే తీసుకోండి’ అని ఆ మహిళ బదులిచ్చింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగా, యమునా నదులు పొంగి ప్రవహించాయి. ఈ నేపథ్యంలో కాన్పూర్, ప్రయాగ్రాజ్, వారణాసితో సహా పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
కాగా, బీజేపీ మిత్రపక్షమైన నిషాద్ పార్టీ అధినేత, మత్స్యశాఖ మంత్రి సంజయ్ నిషాద్ సోమవారం కాన్పూర్ దేహత్లోని వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. వరద నీటిలో నిల్చొన్న స్థానిక మహిళతో ఆయన మాట్లాడారు. ‘మీ పాదాలు శుభ్రం చేసుకునేందుకు గంగా నది మీ ఇంటి మెట్ల వద్దకు చేరుకున్నది. ఇది మిమ్మల్ని నేరుగా స్వర్గానికి తీసుకెళ్తుంది’ అని అన్నారు. దీంతో ‘గంగా ఆశీర్వాదం మీరే పొందండి’ అని ఆ మహిళ అన్నది.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మంత్రి సంజయ్ నిషాద్ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. వరదల వల్ల ప్రభావితమైన ప్రజల దుస్థితిని ఆయన చాలా తేలికగా తీసుకున్నారని ఎస్పీ నేత విమర్శించారు.
“Mother Ganga comes to wash the feet of Ganga-putras, Ganga-putras goes straight to heaven.”
This was the Response by Minister Sanjay Kumar Nishad when locals tried to explain the problems people were facing in the flood-affected Bhognipur village in Kanpur Dehat. BTW, The… pic.twitter.com/CYxpX2V5SR— Mohammed Zubair (@zoo_bear) August 5, 2025
Also Read:
Watch: పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు.. ఆయన ఏం చేశారంటే?
Watch: సింహాన్ని వీడియో తీసేందుకు వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Thief Asleep After Robbery | చోరీ తర్వాత అలసి నిద్రపోయిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?