లక్నో: ఒక దొంగ రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. అలసిపోయిన అతడు ఒక ఇంట్లోని బెడ్‌పై నిద్రపోయాడు. (Thief Asleep After Robbery) ఉదయం నిద్రలేచిన ఇంటి యజమాని ఆ దొంగను చూసి షాకయ్యాడు. చోరీ చేసిన బంగారు ఆభరణాలు, డబ్బును అతడి నుంచి స్వాధీనం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. మరియంపూర్ రైల్వే లైన్ సమీపంలోని నజీరాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సోదరులైన వినోద్ కుమార్, అనిల్ కుమార్ పక్కపక్కనే ఉన్న ఇళ్లలో నివసిస్తున్నారు.
కాగా, మద్యం సేవించిన దొంగ అర్ధరాత్రి వేళ తొలుత వినోద్ ఇంట్లోకి చొరబడ్డాడు. అల్మారా లాకర్‌ను పగులగొట్టి విలువైన వస్తువులను దోచుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న అనిల్ ఇంట్లోకి దొంగ ప్రవేశించాడు. అక్కడి అల్మారాను కూడా పగులగొట్టి అందులో ఉన్న నగలు, డబ్బు దొంగిలించాడు. మద్యం సేవించిన మత్తుతోపాటు అలసిపోవడంతో అనిల్ ఇంటి లోపలున్న బెడ్‌పై అతడు నిద్రపోయాడు.
మరోవైపు ఆటో నడిపే అనిల్ మరునాడు ఉదయం నిద్రలేచాడు. గుర్తు తెలియని వ్యక్తి తన ఇంట్లోని బెడ్‌పై నిద్రిస్తుండటం చూసి షాకయ్యాడు. ఇంట్లో చూడగా కబోర్డ్ విరిగి ఉన్నది. అందులోని విలువైన వస్తువులు కనిపించలేదు. నిద్రిస్తున్న వ్యక్తి వద్ద వెతకగా చోరీ చేసిన నగలు, డబ్బులు అతడి వద్ద ఉన్నాయి. ఇంతలో అరువులు విన్న వినోద్ భార్య కూడా నిద్రలేచింది. వారి ఇంట్లో కూడా చోరీ జరిగినట్లు ఆమె గ్రహించింది.
కాగా, ఈ రెండు కుటుంబాలు పొరుగువారిని అలెర్ట్ చేశారు. దీంతో ఆ దొంగను పట్టుకుని చికతబాదారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు ఆ దొంగను అప్పగించారు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
Also Read:
Man Slits Woman’s Throat | మతమార్పిడి, పెళ్లికి నిరాకరణ.. మహిళ గొంతుకోసి హత్య చేసిన వ్యక్తి
Drunk Army Officer Hits People | తాగిన మత్తులో.. 30 మందిని కారుతో ఢీకొట్టిన ఆర్మీ అధికారి
Teen Jumps From Hill | తల్లి మొబైల్ ఫోన్ కొనడంలేదని.. కొండ పైనుంచి దూకి యువకుడు మృతి