ముంబై: ఒక యువకుడు మొబైల్ ఫోన్ కొనాలని తల్లిని పలుమార్లు అడిగాడు. అయితే ఆమె నిరాకరించింది. ఈ నేపథ్యంలో కొండ పైనుంచి కిందకు దూకాడు. (Teen Jumps From Hill) తీవ్రంగా గాయపడి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. 16 ఏళ్ల అథర్వ గోపాల్ టేడే, పోలీస్ నియామక పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు. తనకు మొబైల్ ఫోన్ కొని ఇవ్వాలని తల్లిని పలుమార్లు అడిగాడు. అయితే ఆమె ప్రతిసారి నిరాకరించింది.
కాగా, గోపాల్ ఆదివారం కూడా మొబైల్ ఫోన్ కొనమని తన తల్లిని మరోసారి అడిగాడు. ఆమె నిరాకరించింది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. టిస్గావ్లోని కొండపైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకాడు.
మరోవైపు గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన గోపాల్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman, Boyfriend Kill Husband | ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ.. ఏడాది తర్వాత వెలుగులోకి
Watch: పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు.. ఆయన ఏం చేశారంటే?