చండూరు మార్చి 09 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారము భోజన విరామ సమయంలో మండల వనరుల కేంద్రం చండూరులో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మొదటిరోజు మండల స్థాయిలో నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారూ.
అదేవిధంగా ఈనెల 16న జిల్లా కేంద్రంలో ఈ నెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు పేస్కేలు వేతనాలు చెల్లించడంతోపాటు గత సంవత్సరము 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఐఎస్ కే.రవికుమార్ కంప్యూటర్ ఆపరేటర్ చారి, సి ఆర్ పి లు సైదులు,స్వామి, మహేష్ ,మెసెంజర్ సాయిలు, పాల్గొన్నారు.