జైపూర్: భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీజేపీ మంత్రి వింతగా వివరణ ఇచ్చారు. కృష్ణుడ్ని సీఎం ప్రార్థించినప్పుడల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఆ తర్వాత శాంతించాలని వరుణ దేవుడ్ని కోరుతున్నారని అన్నారు. దీంతో ఆ బీజేపీ మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. (Rajasthan Minister) బీజేపీ పాలిత రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బార్మర్ జిల్లాలోని బలోత్రా ప్రాంతం జలమయమైంది. పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీరు కూడా ఇళ్లు, పొలాల్లోకి చేరుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కాగా, రాజస్థాన్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి కేకే విష్ణోయ్ శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. దీంతో ప్రజలు ఎదుర్కొంటున్న వరద, కలుషిత నీటి కష్టాల గురించి మీడియా ఆయనను ప్రశ్నించింది. దీనికి ఆయన వింతగా సమాధానం ఇచ్చారు. ‘బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మనం మాట్లాడుతున్న బార్మర్-బలోత్రా జిల్లాలో ఇంద్రుడు చాలా ఉదారంగా ఉంటాడు. మన ముఖ్యమంత్రి భరత్‌పూర్‌లో శ్రీకృష్ణుడిని ప్రార్థించినప్పుడల్లా, ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు తమ జీవితాలను కొనసాగించగలిగేలా వర్షాన్ని తగ్గించమని ముఖ్యమంత్రి ఇంద్రుడిని అభ్యర్థించాల్సి వస్తుంది’ అని అన్నారు.
మరోవైపు మంత్రి విష్ణోయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. మానవుల వల్ల జరిగే సంక్షోభానికి దేవుళ్లపై బాధ్యతను నెట్టడం హాస్యాస్పదమని కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ చౌదరి విమర్శించారు. అసలు సమస్యను పక్కదారి పట్టించడమే కాకుండా, ప్రభుత్వం దానిని పరిష్కరించలేదని, దేవుడికి ప్రార్థనలు మాత్రమే సహాయపడతాయని మంత్రి అనడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read:
Watch: పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు.. ఆయన ఏం చేశారంటే?
Boy Dies By Suicide | వీడియో గేమ్స్‌కు బానిసైన బాలుడు.. ఆత్మహత్యకు పాల్పడి మృతి
Woman Murder’s Husband | కుమార్తె, ఇద్దరు అబ్బాయిలతో కలిసి.. భర్తను హత్య చేసిన భార్య
Watch: అదనపు లగేజీపై వివాదం.. స్పైస్ జెట్ సిబ్బందిపై ఆర్మీ అధికారి దాడి