న్యూఢిల్లీ: ఒక బాలుడు వీడియో గేమ్స్‌కు బానిస అయ్యాడు. వర్షం వల్ల స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడు. దీంతో పలు గంటలపాటు మొబైల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉద్యోగానికి వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు చూడగా ఇంట్లో ఉరివేసుకుని అతడు మరణించాడు. (Boy Dies By Suicide) దీంతో బాలుడి ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. అంబికా విహార్ కాలనీలో నివసించే కుటుంబానికి చెందిన పదేళ్ల బాలుడు నంగ్లోయిలోని ఎంసీడీ స్కూల్లో చదువుతున్నాడు. మొబైల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడటంలో అతడు బానిస అయ్యాడు.
కాగా, జూలై 31న వర్షం వల్ల ఆ బాలుడు స్కూల్‌కు వెళ్లలేదు. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు అతడ్ని ఇంట్లో ఉంచి వెళ్లారు. ఈ నేపథ్యంలో సుమారు 11 గంటలపాటు మొబైల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడాడు. సాయంత్రం పేరెంట్స్ ఇంటికి వచ్చి చూడగా ఇనుప పైపునకు ఉరి వేసుకుని వేలాడుతూ శవమై కనిపించాడు.
మరోవైపు బాలుడి మరణం గురించి తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
కాగా, బాలుడి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు తిట్టడం, స్కూల్లో ఒత్తిడి లేదా మొబైల్ గేమ్‌లో ఓడిపోవడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి కారణంగా ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman Murder’s Husband | కుమార్తె, ఇద్దరు అబ్బాయిలతో కలిసి.. భర్తను హత్య చేసిన భార్య
Namasthe TelanganaWatch: అదనపు లగేజీపై వివాదం.. స్పైస్ జెట్ సిబ్బందిపై ఆర్మీ అధికారి దాడి
Watch: పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు.. ఆయన ఏం చేశారంటే?