గౌహతి: ఒక మహిళ, ఆమె కుమార్తెకు ఇద్దరు అబ్బాయిలతో సంబంధం ఉన్నది. ఈ నేపథ్యంలో వారంతా కలిసి మహిళ భర్తను హత్య చేశారు. (Woman Murder’s Husband) గుండెపోటు వల్ల చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. అయితే మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్యగా నిర్ధారణ అయ్యింది. అస్సాంలోని దిబ్రుగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 25న లాహోన్ గావ్‌లోని బోర్బరువా ప్రాంతానికి చెందిన ఉత్తమ్ గొగోయ్ గుండెపోటుతో మరణించినట్లు అతడి సోదరుడికి సమాచారం అందింది. దీంతో అతడు వెంటనే ఆ ఇంటికి వెళ్లాడు.
కాగా, మరణించిన ఉత్తమ్ చెవిపై గాయం ఉండటాన్ని సోదరుడు గమనించాడు. గుండెపోటుతో చనిపోతే చెవి ఎలా తెగుతుందని ప్రశ్నించాడు. అయితే తమ ఇంట్లో దోపిడీ జరిగిందని, దొంగల దాడిలో ఉత్తమ్ మరణించినట్లు అతడి భార్య బాబీ సోనోవాల్, కూతురు మాటమార్చారు. దీంతో అనుమానించిన మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఉత్తమ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. దాడి వల్ల అతడు మరణించినట్లు రిపోర్ట్‌లో తేలింది. ఈ నేపథ్యంలో మృతుడి భార్య బాబీ, 9వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కాగా, తన బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి తండ్రిని హత్య చేసినట్లు మృతుడి కుమార్తె పోలీసుల ముందు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు అబ్బాయిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కుమార్తెతో పాటు ఆమె తల్లి బాబీతో కూడా ఆ అబ్బాయిలకు సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man Stabs Pregnant Wife | గర్భవతి అయిన భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
Watch: అదనపు లగేజీపై వివాదం.. స్పైస్ జెట్ సిబ్బందిపై ఆర్మీ అధికారి దాడి
Watch: పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు.. ఆయన ఏం చేశారంటే?