లక్నో: గర్భవతి అయిన భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేశాడు. (Man Stabs Pregnant Wife) ఆ తర్వాత ఆ గది లోపల నుంచి డోర్ లాక్ చేసుకున్నాడు. పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. రవిశంకర్, స్వప్న దంపతులకు ఈ ఏడాది జనవరిలో వివాహం జరిగింది. అతడి భార్య ఏడు నెలల గర్భవతి. అయితే భర్తతో గొడవల వల్ల ఐదు నెలలుగా అమ్హెరా ప్రాంతంలోని సోదరి ఇంట్లో ఆమె నివసిస్తున్నది.
కాగా, శనివారం ఉదయం రవిశంకర్ అక్కడకు వెళ్లాడు. భార్య స్వప్నతో మాట్లాడటానికి వచ్చినట్లు ఆమె సోదరి కుటుంబ సభ్యులకు చెప్పాడు. మొదటి అంతస్తులోని ఒక గదికి భార్యను తీసుకెళ్లి డోర్ లాక్ చేశాడు. వెంట తెచ్చిన కత్తితో స్వప్న గొంతుకోశాడు. ఆమె శరీరంపై పలుచోట్ల పొడిచాడు. భార్య చనిపోయే వరకు కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. అయితే డోర్ లాక్ చేసి ఉండటంతో స్వప్న అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆమెను కాపాడలేకపోయారు.
మరోవైపు భార్య స్వప్న హత్య తర్వాత పోలీసులకు రవిశంకర్ ఫోన్ చేశాడు. తన భార్యను చంపినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి ఆ గదిలోకి వెళ్లారు. రక్తం మడుగుల్లో పడి ఉన్న భార్య మృతదేహం వద్ద ఉన్న రవిశంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వప్న మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
CRPF jawan shot dead | కన్వర్ యాత్రలో ఘర్షణ.. సీఆర్పీఎఫ్ జవాన్‌పై కాల్పులు జరిపి హత్య
Girl CWatch: సడన్ బ్రేక్ వేసిన బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిన తల్లి చేతిలోని బిడ్డarries Snake Bitten Mother | పాము కాటేసిన తల్లిని.. వీపుపై ఐదు కిలోమీటర్లు మోసిన బాలిక
Watch: సడన్ బ్రేక్ వేసిన బస్సు డ్రైవర్.. రోడ్డుపై పడిన తల్లి చేతిలోని బిడ్డ