చెన్నై: బస్సు డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో డోర్ వద్ద కూర్చొన్న మహిళ చేతిలోని బిడ్డ రోడ్డుపై పడింది. ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. (Child Falls From Moving Bus) పక్కనే కూర్చొన్న ఆమె సోదరుడు, అతడి ఒడిలో ఉన్న బాలుడు కూడా బస్సులో పడి గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముత్తురామలింగపురం ప్రాంతానికి చెందిన మహిళ ఇద్దరు చంటి పిల్లలు, సోదరుడితో కలిసి శుక్రవారం ఉదయం ప్రైవేట్ బస్సులో ప్రయాణించింది. డోర్ వద్ద ఉన్న సీట్లలో వారు కూర్చొన్నారు. ఆ మహిళ చేతిలో ఏడాది వయస్సున్న బిడ్డ ఉండగా, సోదరుడి ఒడిలో కుమారుడు ఉన్నాడు.
కాగా, శ్రీవిల్లిపుత్తూరులోని మీనాక్షిపురం జంక్షన్ సమీపంలో బస్సు డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో డోర్ ముందున్న సీటులో కూర్చొన్న తల్లి చేతిలోని బిడ్డ రోడ్డుపై పడింది. ఆ పసిపాప తీవ్రంగా గాయపడింది. ఆ మహిళ సోదరుడు, అతడి ఒడిలో ఉన్న కుమారుడు కూడా అదుపుతప్పి బస్సు ఫ్లోర్‌పై పడ్డారు. వారిద్దరూ కూడా గాయపడ్డారు.
మరోవైపు గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు నుంచి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఆ ప్రైవేట్ బస్సులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బస్సుల్లో డోర్ వద్ద ఉన్న సీట్లలో కూర్చొన్న ప్రయాణికుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తమైంది.
ஸ்ரீவில்லிபுத்தூர்: சடன் பிரேக் போட்ட பேருந்து ஓட்டுநர்: பேருந்தில் இருந்து சாலையில் குழந்தை தவறி விழும் பகீர் காட்சி.. நல்வாய்ப்பாக காயத்துடன் குழந்தை உயிர் தப்பியது#Srivilliputhur | #Bus | #Accident | #CCTV pic.twitter.com/QoqqU4xWjx
— PttvOnlinenews (@PttvNewsX) August 1, 2025
Also Read:
Girl Carries Snake Bitten Mother | పాము కాటేసిన తల్లిని.. వీపుపై ఐదు కిలోమీటర్లు మోసిన బాలిక
Watch: మహిళ ఇంటికి వెళ్లిన పోలీస్ అధికారి.. ఆమె ఏం చేసిందంటే?