లక్నో: ఒక మహిళ తన భర్తను చంపేందుకు సోదరులతో కలిసి కుట్రపన్నింది. దీంతో కొందరు గూండాలతో కలిసి అతడ్ని కొట్టారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఒక చోట గొయ్యి తవ్వి సజీవంగా పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. (Wife Plots Husband’s Murder) అయితే ఒక వ్యక్తి అక్కడకు రావడంతో వారంతా పారిపోయారు. ఈ నేపథ్యంలో అదృష్టవశాత్తు అతడు బతికిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. రాజీవ్ అనే వ్యక్తికి 2009లో సాధనతో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. గ్రామంలో సొంత ఇల్లు ఉన్నది. అయితే భార్య బలవంతంపై బరేలీలోని అద్దె ఇంట్లో రాజీవ్ నివసిస్తున్నాడు. ఒక డాక్టర్ వద్ద అసిస్టెంట్‌గా అతడు పనిచేస్తున్నాడు.
కాగా, భర్త రాజీవ్ హత్య కోసం భార్య సాధన కుట్రపన్నింది. భర్తను చంపాలని తన ఐదుగురు సోదరులకు చెప్పింది. ఈ నేపథ్యంలో కొంతమంది కిరాయి గూండాలతో కలిసి రాజీవ్‌ను హత్య చేసేందుకు వారు ప్రయత్నించారు. జూలై 21న రాత్రి వేళ ఇంటి వద్ద ఉన్న అతడిపై 11 మంది వ్యక్తులు దాడి చేశారు. రాజీవ్‌ను కర్రలతో కొట్టారు. అతడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. తీవ్రంగా గాయపడిన రాజీవ్‌ను సమీపంలోని అటవీ ప్రాంతానికి వాహనంలో తీసుకెళ్లారు. సజీవంగా పాతిపెట్టేందుకు అక్కడ గొయ్యి తవ్వారు. ఇంతలో ఒక వ్యక్తి అటు రావడం చూసి వారంతా అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు తీవ్ర గాయాలతో కదలలేక, కనీసం నోరు విప్పలేని స్థితిలో ఉన్న రాజీవ్‌ను ఆ వ్యక్తి చూశాడు. అంబులెన్స్ కోసం ఫోన్ చేశాడు. దీంతో అతడ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, కోడలు, ఆమె సోదరులు తన కుమారుడ్ని కొట్టి చంపేందుకు ప్రయత్నించినట్లు రాజీవ్ తండ్రి తెలుసుకున్నాడు. దీంతో పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. తన కుమారుడి హత్యకు యత్నించిన అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Girl Carries Snake Bitten Mother | పాము కాటేసిన తల్లిని.. వీపుపై ఐదు కిలోమీటర్లు మోసిన బాలిక
Peon gives urine to senior | తాగునీరు అడిగిన సీనియర్ అధికారి.. మూత్రం నింపిన బాటిల్ ఇచ్చిన ప్యూన్
Watch: మహిళ ఇంటికి వెళ్లిన పోలీస్ అధికారి.. ఆమె ఏం చేసిందంటే?