భువనేశ్వర్: ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహించిన సీనియర్ అధికారి తాగు నీరు ఇవ్వాలని ప్యూన్‌ను అడిగాడు. అయితే మూత్రం నింపిన బాటిల్ అతడు ఇచ్చాడు. (Peon gives urine to senior) అది తాగిన ఆ అధికారి ఆసుపత్రి పాలయ్యాడు. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 23న ఆర్ ఉదయగిరిలోని ఆర్డబ్ల్యుఎస్ఎస్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గురుప్రసాద్ పట్నాయక్, ఇతర సిబ్బంది రాత్రివేళ విధుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా తాగు నీరు ఇవ్వాలని ప్యూన్ సుభాష్ చంద్ర బెహెరాను ఆ అధికారి అడిగాడు.
కాగా, ఆ ప్యూన్ మూత్రం నింపిన బాటిల్‌ను గురుప్రసాద్‌కు ఇచ్చాడు. వాటర్‌గా భావించిన ఆ అధికారితోపాటు మరో ఇద్దరు సిబ్బంది దానిని తాగారు. ఆ తర్వాత కొంతసేపటికే ఇంజినీర్ గురుప్రసాద్ అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఆయన చేరాడు.
మరోవైపు తాను తాగిన నీటిపై గురుప్రసాద్ అనుమానం వ్యక్తం చేశాడు. ఆ బాటిల్లోని నీటి నమూనాలను ల్యాబ్‌కు పంపాడు. అమ్మోనియా సాంద్రత ఎక్కువగా ఉండటంతో అది మూత్రంగా తేలింది. దీంతో ప్యూన్ సుభాష్ చంద్ర బెహెరాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ ప్యూన్ ఎందుకు ఇలా చేశాడు అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
SSC Students Protest | ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలు.. విద్యార్థుల నిరసన
Watch: స్కూల్ గేట్ వద్ద విద్యార్థిని కిడ్నాప్.. తర్వాత ఏం జరిగిందంటే?