Tirumala : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తులు నిత్యం పోటెత్తుతుంటారు. ఈ క్రమంలోనే సోమవారం క్యూ లైన్లలోని కొందరు భక్తులు గొడవపడ్డారు. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. గొడవను గమనించి వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు ఘర్షణను నిలువరించారు.
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు ఈ విధంగా పరస్పర ఘర్షణకు దిగడం సమంజసం కాదని భద్రతా సిబ్బంది వారిని వారిచంఆరు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండేవారు.. ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తూ తోటి భక్తులతో స్నేహ పూర్వకంగా ఉండాలని గొడవకు దిగిన వారికి సూచించారు.
తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ
వెంటనే అప్రమత్తమై ఘర్షణను నిలువరించిన భద్రతా సిబ్బంది మరియు శ్రీవారి సేవకులు
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు ఈ విధంగా పరస్పర ఘర్షణకు దిగడం సమంజసం కాదని, ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తూ… pic.twitter.com/pRnxa9knnZ
— Telugu Scribe (@TeluguScribe) March 2, 2026
ఈ ఘటన తమ దృష్టికి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్పందించింది. అదేవిధంగా క్యూలైన్ నియమాలను తప్పనిసరిగా పాటించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.